Prabhas:సలార్‌కి అరుదైన రికార్డు ఖాయం

40
- Advertisement -

మన ప్రేక్షకులకు సహజంగానే యాక్షన్ సినిమాలు అంటే మోజు ఎక్కువ. ఇక స్టార్ హీరో గారు ఆ ఊర మాస్ గెటప్ లో విలన్ల నడ్డి విరిచేస్తే.. ఇంకా మోజు ఎక్కువ చూపిస్తారు మన ప్రేక్షక దేవుళ్ళు. అయితే, మాస్ అండ్ యాక్షన్ అనే పదాలకు ప్రస్తుతం పెంటెంట్ రైట్స్ తీసుకోవాలి అంటే.. అవి కచ్చితంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కే చెందుతాయి. కేజీఎఫ్ తో బాక్సాఫీస్ నే ఉఫ్ అనిపించేశాడు. అరె.. అసలు సినిమాని ఇలా కూడా తియ్యోచ్చా ? అనిపించాడు. అలాంటి ప్రశాంత్‌ నీల్‌ కష్టపడి ఇష్టపడి ఓ సినిమా చేస్తున్నాడు.

పైగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను హీరోగా పెట్టుకుని ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్’ అంటూ రాబోతున్నాడు. ఈ సినిమా పై భారీ క్రేజ్ ఉంది. బహుశా ఏ పాన్ ఇండియా సినిమాకి లేనంత క్రేజ్ ఉంది. అసలు ఇలాంటి సినిమా కోసం ఎవరైనా చాలా ఎదురు చూస్తారు. భారీగా హోప్స్ పెట్టుకుంటారు. ఇక ఫస్ట్ డే ఫస్ట్ టికెట్స్ కోసమైతే ఎగబడతారు. ప్రస్తుతం అదే జరుగుతుంది. నార్త్ అమెరికాలో ఆల్ రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డిమాండ్ రీత్యా టికెట్ రేట్లను డబుల్ చేశారు. అయినా ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. టికెట్స్ ఓపెన్ చేస్తున్న అవర్స్ లోనే హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి.

ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు ఇంత క్రేజ్ రాలేదని అంటున్నారు. మరి సలార్ ప్రభాస్ సిని కెరీర్ లో ఏ స్థాయి హిట్ ను అందుకుంటుందో చూడాలి. ఇప్పుడున్న అంచనాలను బట్టి.. సలార్ అరుదైన రికార్డును కూడా సాధించేలా ఉంది. యూఎస్ లో విడుదలైన ఇండియన్ సినిమాల్లో తొలి రెండు వారాల్లోనే అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సలార్ నిలిచేలా ఉంది. ఈ విషయాన్ని యూఎస్ నుంచి బయ్యర్లు సోషల్‌ మీడియా వేదికగా చెబుతున్నారు. ఇక అన్ని భాషల్లో కలుపుకుంటే.. భారతదేశంలోనే అత్యధికంగా కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రంగా కూడా సలార్ నిలుస్తోందట.

Also Read:Rishi Sunak:దాని కంటే చనిపోవడమే బెటర్

- Advertisement -