సాహో మొదలుపెట్టాడు..

414
Prabhas Sahoo Movie Shooting Started
- Advertisement -

హీరో ప్రభాస్ తన తాజా చిత్రం సాహో షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే‘సాహో’ గురించి లేటెస్ట్ అప్డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’కి జోడీగా ఏ భామని తీసుకోవాలనుకుంటున్నారు.. షూటింగ్‌ ఎక్కడ జరగబోతోంది అన్న విషయాలన్నీ ‘సాహో’పై ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. అయితే బాహుబలి-2 సక్సెస్ తర్వాత అమెరికాలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్.. అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నాడు. సాహో సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు.

ప్రభాస్’బాహుబలి 2′ సినిమాతో బాగా పాప్యులర్ అయిన ‘సాహో’ అనే పదమే ప్రభాస్ తదుపరి సినిమాకి టైటిల్ గా మారిపోయింది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా మొదలైపోయింది. రెండు రోజులుగా ఈ సినిమా షూటింగ్ సెంట్రల్ లైబ్రరీ .. రామోజీ ఫిల్మ్ సిటీలోను జరుగుతోందని అంటున్నారు.

Prabhas Sahoo Movie Shooting Started

ప్రభాస్ ఇంకా ఈ సినిమా షూటింగులో జాయిన్ కాలేదు. ఇక హీరోయిన్ గా అనుష్కను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ .. అధికారిక ప్రకటన అయితే రాలేదు. అందువలన హీరో హీరోయిన్లకి సంబంధం లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. విలన్ గా చేస్తోన్న నీల్ నితిన్ ముఖేష్ తదితరులపై ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ‘బాహుబలి 2’ తరువాత వస్తోన్న సినిమా కావడం వలన, ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.

- Advertisement -