బాహుబలి మూవీ కోసం 4ఏళ్లకు పైగా సమయం కేటాయించిన ప్రభాస్ ఎట్టకేలకు ఆ ప్రాజెక్టును సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. బాహుబలి-2 విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బాహుబలి2 సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ అమెరికా వెళ్లిపోయాడు.
అక్కడే కొన్ని రోజులు ఉన్నాడు. చాలాకాలం తర్వాత తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సుదీర్ఘకాలం గడిపిన ప్రభాస్.. ఇప్పుడు యూఎస్ టూర్ ఫినిష్ చేసుకుని ఇండియా తిరిగి వచ్చేశాడు.
ఇక ఇదిలా ఉంటే..బాహుబలి తర్వాత ప్రభాస్ సుజీత్ డైరెక్షన్‌లో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి, సాహో కోసం ప్రభాస్ ఎలా తయారయ్యాడు..? కండలు తిరిగిన బాడీతో బాహుబలిలో కనిపించిన ప్రభాస్.. తన తర్వాతి సినిమా కోసం ఎలాంటి లుక్‌తో ఎంట్రీ ఇవ్వనున్నాడు..? అనే డౌట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎప్పటినుంచో ఉన్నవే. అయితే ఆ డౌట్స్ కి ఇప్పుడు బ్రేక్ పడిపోయింది.
ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తో కలిసి ప్రభాస్ కనిపించగా.. యంగ్ రెబల్ స్టార్ కొత్త హెయిర్ స్టైల్ తో అదరగొట్టేస్తున్నాడు. బాహుబలి నుంచి కంప్లీట్ మేకోవర్ ఇచ్చేశాడనే సంగతి అర్ధమవుతూనే ఉంది. అయితే.. ఇంతలోనే ప్రభాస్ ఇంత ఛేంజ్ చూపిస్తాడనే విషయాన్ని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రభాస్ న్యూ లుక్ కి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఆ ఫొటోను తన ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. సాహో సినిమా కోసం బాహుబలిని కొత్త అవతారంలో చూపించబోతోంది ఆయనేననట. ఈ నేపథ్యంలోనే హకీం.. ‘ద బాహుబలి ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. ప్రభాస్’ అంటూ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
కాగా, సాహో సినిమా కోసం సన్నబడేందుకు ప్రభాస్ బాగానే కసరత్తులు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. 150 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న సాహో హీరోయిన్ పై ఇంకా సస్సెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే ఓ భామకు ఫైనల్ అయ్యారని అంటున్నారు. కానీ.. పేరు మాత్రం బయటపడడంలేదు. మొత్తానికి సాహో.. సమ్మర్ నాటికి రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.