ప్రభాస్‌ చేతిలో రావణ దహనం@రామ్‌లీలా మైదానం

70
prabhas
- Advertisement -

విజయదశమి అనగానే చేడు మీద మంచి గెలిచిన రోజుఅని కొందరు అంటుంటారు. మరికొంతమంది రాముడు రావణుడ్ని చంపిన రోజు అని అంటారు. అయితే ఈ ఢిల్లీలోని లవకుశ రామ్‌లీలా మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాలు వెరీవెరీ స్పెషల్‌. ఇందులో స్పెషల్‌ ఎంటని అనుకుంటున్నారా…ఆ విశిష్ట వేడుకల్లో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. ఆయనే స్వయంగా రావన దహనం చేయనున్నారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలంటూ లవకుశ రామ్‌లీలా క‌మిటీ నుంచి ప్రభాస్ కు ఇప్పటికే ఆహ్వానం కూడా అందింది. సెప్టెంబ‌ర్ 26 నుంచి ద‌స‌రా వేడుక‌లు ప్రారంభం కానుండ‌గా.. ఈ ఏడాది లవకుశ రామ్‌లీలా క‌మిటీ ఎర్రకోట వ‌ద్ద అయోధ్యలోని రామాల‌యం థీమ్‌పై మండ‌పాన్ని ఏర్పాటు చేస్తోంది.

ఆదిపురుష్‌ మూవీలో రాముడి పాత్రను పోషిస్తున్న ప్రభాస్ కంటే మెరుగైన వారు ఎవ‌రుంటార‌ని లవకుశ రాంలీలా క‌మిటీ చీఫ్ అర్జున్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకే ఆయనను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించామని చెప్పారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధ్ దిష్టిబొమ్మల‌ను ప్రభాస్ తన బాణంతో దహనం చేస్తార‌ని ఆయన చెప్పారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఏడాది దిష్టిబొమ్మలు 100 అడుగుల ఎత్తులో ఉండబోతున్నాయి. గతంలో అజయ్ దేవగన్ , జాన్ అబ్రహం వంటి నటులు ఈ వేడుకలలో పాల్గొన్నారు.

- Advertisement -