ప్రభాస్ పిటిషన్‌పై ఇవాళ విచారణ

224
prabhas
- Advertisement -

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి రాయదుర్గం సమీపంలోని పైగా భూముల్లో ఉన్న సినీ నటుడు ప్రభాస్‌ గెస్ట్ హౌస్‌ను అధికారులు సీజ్ చేయడం,ప్రభాస్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలం వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్‌ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ ఇవాళ విచారణకు రానుంది.

ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నానని వెల్లడించారు. క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించానని కానీ రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చూపుతూ తనను ఖాళీ చేయాలని చెబుతున్నారని.. వాస్తవానికి తీర్పుతో తనకు సంబంధం లేదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు.

పాన్మక్త గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వానిదే నంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్ ఉండటంతో దాన్నీ సీజ్‌ చేశారు.

- Advertisement -