టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు..!

241
telangana congress
- Advertisement -

కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున అధికార టీఆర్ఎస్‌లోకి వలసలు ఉంటాయని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకురుస్తు సీఎం కేసీఆర్‌ని కలిశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఆకుల లలిత,కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ వేర్వేరుగా కేసీఆర్‌ని కలిశారు.

టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి రావడం, కేసీఆర్ సీఎం గా బాధ్యతలు స్వీకరించడంపై అభినందనలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఆకుల లలిత ఓటమి పాలయ్యారు. కరీంనగర్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ పదవీ కాలం త్వరలో ముగియనుంది. తిరిగి ఆయన టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

వీరిద్దరి చేరికతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల బలం నాలుగు నుండి రెండుకు పడిపోనుంది. దీంతో ప్రతిపక్ష హోదాను కూడా కొల్పోయే అవకాశం ఉంది. మండలిలో ప్రతిపక్ష హోదా కావాలంటే నలుగురు సభ్యుల బలం అవసరం.కాంగ్రెస్‌కు నలుగురు ఎమ్మెల్సీలు లేకపోవడంతో మండలిలో ప్రతిపక్ష హోదా కొల్పోనుంది.

ఇక ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతిరెడ్డి, యాదవరెడ్డి, కొండా మురళీ, రాములు నాయక్ ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో వారికి మండలి చైర్మెన్ స్వామి గౌడ్ నోటీసులు కూడా జారీ చేశారు.

- Advertisement -