డార్లింగ్‌ పుట్టిన రోజున ప్రాజెక్ట్‌-కె పోస్టర్‌ రిలీజ్‌

392
- Advertisement -

బహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా ఎదిగిన డార్లింగ్‌. ప్రభాస్‌ మొత్తం పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. రాధేశ్యామ్‌తో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన డార్లింగ్‌…నాగ్‌ఆశ్విన్‌తో కలిసి ప్రాజెక్ట్‌ కే మూవీ చేస్తున్నారు. బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూశారు.

అభిమానులు అనుకున్నట్లే దర్శక, నిర్మాతలు పోస్టర్స్, అప్ డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. తాజాగా రెబల్‌ బర్త్‌డే సందర్భంగా మూవీ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రబృందం.

ఈ పోస్టర్ లో ఉన్నది ఏంటో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. కొంతమంది కాలు అని.. మరికొంతమంది చేయి అని కామెంట్స్ చేస్తున్నారు. అది కాలో.. చేయో తెలియదు కానీ.. దానిపై రోబో కవచం తొడిగి ఉండడం విశేషం. పోస్టర్ పైన హీరోలు పుట్టరు.. వాళ్లు ఎదుగుతుంటారు అంటూ క్యాప్షన్ పెట్టారు.

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఇతిహాసాలకు ట్రైమ్ ట్రావెల్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ని మిక్స్ చేసి ఈ మూవీని తీస్తున్నారు. ప్రాజెక్ట్ కె మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌ లో కె అంటే కల్కి అని అర్ధం. సినిమాలో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ పేరు కూడా అదేనట. దీపికా పదుకొనె హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

- Advertisement -