ప్రభాస్‌ షో రెండు భాగాలు…

1207
- Advertisement -

నందమూరి అందగాడు బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న ఆన్‌స్టాపబుల్‌ సీజన్‌2 రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన వ్యక్తులను గెస్ట్‌లుగా పిలిచి షోను నడిపిస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన డార్లింగ్‌ ప్రభాస్‌ కూడా షో లో పాల్గొన్నాడు. అంతేకాదు. ఈషోలో మరోక నటుడు కూడా చేరిపోయారు. ఇక షోను రెండు భాగాలుగా రాబోతుందని ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ గిప్ట్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఆహా టీం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే పలువురు యంగ్‌హీరోలు కూడా వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్‌కళ్యాణ్‌ షో కూడా త్వరలో స్ట్రీమింగ్‌ కాబోతుందని ఇప్పటికే తెలిపింది ఆహా టీం. అన్‌స్టాపబుల్‌ షోకు త్వరలోనే పవన్‌కల్యాణ్‌తోపాటు డైరెక్టర్లు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో ఎన్‌బీకే విత్‌ పీఎస్‌పీకే అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి…

మే12న కస్టడీ విడుదల

మైఖేల్…నువ్వుంటే చాలు సాంగ్‌

ఏప్రిల్ 28… పీఎస్‌2

- Advertisement -