మహాశివరాత్రి స్పెషల్ : ఏనుగుపై ప్రభాస్

242
Prabhas In Baahubali 2 'Maha Shivaratri' Special Poster
- Advertisement -

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ బాహుబలి. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘బాహుబలి-2’ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా ఇప్పుటినుంచే బహుబలి-2 ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక మహాశివరాత్రి సందర్భంగా బాహుబలి-2 లో ప్రభాస్‌ ఫోటోని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఈ పోస్టర్‌లో గజేంద్రుని పై ఉన్న బాహుబలి ప్రభాస్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్‌తో సినిమాపై మరింత క్రేజ్ పెంచేశాడు రాజమౌళి. ఇక ఇప్పటికే బాహుబలి టీం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తోంది. రీసెంట్‌గా కాకినాడ లోని .. నాగమల్లితోట జంక్షన్‌ సమీపంలోని లాల్‌బహుద్దూర్‌ నగర్‌ మిర్చి రెస్టారెంట్‌లో విజువల్‌ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించగా ఇవాళ హాశివరాత్రి సందర్బంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్లో ‘బాహుబలి – ది బిగినింగ్’ సెకండ్ షోను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

 Prabhas In Baahubali 2 'Maha Shivaratri' Special Poster  Prabhas In Baahubali 2 'Maha Shivaratri' Special Poster  Prabhas In Baahubali 2 'Maha Shivaratri' Special Poster  Prabhas In Baahubali 2 'Maha Shivaratri' Special Poster

- Advertisement -