హీరో గోపిచంద్ కుమారుడి బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోపిచంద్ 2013సంవత్సరంలో రేష్మని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2014 అక్టోబర్ లో వారికి మొదట అబ్బాయి జన్మించాడు. అతనికి గోపిచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్ కృష్ణ అని పేరు పెట్టారు. గతేడాది వినాయక చవితి రోజు గోపిచంద్ రేష్మ దంపతులకు మరో కుమారుడు జన్మించాడు. అతనికి వియాన్ అని పేరు పెట్టారు.
నిన్న వియాన్ మొదటి పుట్టిన రోజును హైదరాబాద్ లోని ఓ హోటల్ లో గ్రాండ్ గా సెలబ్రెట్ చేశారు. ఈపుట్టిన రోజు వేడుకకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు హాజరయ్యారు. వియాన్ బర్త్ డే వేడుకల్లో పలువురితో కలిసి వారు ఎంజాయ్ చేశారు. ప్రభాస్, గోపిచంద్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.
గోపిచంద్ భార్య రేష్మ హీరో శ్రీకాంత్ కు దగ్గరి బంధువు. ప్రస్తుతం గోపిచంద్ చాణక్య మూవీలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈసినిమా థియేటర్లలోకి రానుంది. లౌక్యం సినిమా తర్వాత నుంచి గోపిచంద్ కు సరైన హిట్ రాలేదు. చాణక్యతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు గోపిచంద్.