కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం సాధించిన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ కమిషన్ మెంబర్ గటిక అజయ్ కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రిబ్యునల్ కమిషన్ మొదటి తీర్పు ఇచ్చిన సందర్భంగా కమిషన్ మెంబర్ గటిక అజయ్ కుమార్ ను కూడా మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.
ఇటీవల స్వచ్ఛ భారత్ లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి అవార్డుని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం వర్చువల్ పద్ధతిలో అందచేశారు. గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఈ అవార్డుని తెలంగాణ రాష్ట్రం తరపున రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అందుకున్నారు.