పవన్‌కు విజన్ లేదు:మహేష్

30
- Advertisement -

జనసేన అధినేత పవన్‌కు ఓ విజన్ లేదని మండిపడ్డారు పోతినేని మహేష్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆశీంచి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ వస్తున్నారు మహేష్. అయితే తీరా పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ సుజనా చౌదరికి కేటాయించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహేష్. పార్టీకి రాజీనామా చేసి, ఆ లేఖను పవన్‌కు పంపారు.

ఈ సందర్భంగా పవన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నటించేవాళ్లు నాయకులు కాలేరని …జనసేనకు ఆవేశంతోనో, సీటు రాలేదనో రాజీనామా చేయలేదని తెలిపారు మహేష్. కొత్తతరం నేతలను పవన్‌ తయారు చేస్తారని గుడ్డిగా అడుగువు వేశాం.. ఇన్ని రోజులు పవన్‌తో కలిసి నడిచి తప్పు చేశామన్నారు. అసలు పార్టీ నిర్మాణంపై పవన్ ఏ రోజు దృష్టి పెట్టలేదని ఆరోపించారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -