తమలపాకుతో.. జుట్టు స్ట్రాంగ్!

75
- Advertisement -

తమలపాకు మన సంప్రదాయాలలో ఒక భాగమనే సంగతి తెలిసిందే. పెళ్లిళ్ల టైమ్ లోనూ, శుభకార్యాల సమయంలోనూ తామలపాకు కచ్చితంగా ఉంటుంది. ఇక రుచికరమైన భోజనం చేసిన తరువాత తమలపాకును కిల్లి మాదిరి తినడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే తమలపాకు వల్ల ఇంకా మనకు తెలియని ఎన్నో ప్రయోజనలు ఉన్నాయనే సంగతి తెలుసా ? ముఖ్యంగా తమలపాకు వల్ల జుట్టుకు ఎంతో మేలు కలుగుతుందట. మరి ఆ విషయాలను తెలుసుకుందాం !

తమలపాకులో విటమిన్స్, మినరల్స్ మెండుగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టును కుదుళ్ల దాకా బలంగా ఉంచడంలో ఎంతగానో సహాయ సహాయపడతాయి. రెండు నుంచి నాలుగు తమలపాకులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత అందులో రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా చేసిన పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి ఐదు నుంచి పది నిముషాల వరకు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు, దురద, వంటి సమస్యలు దురమౌతాయి. అంతే కాకుండా జుట్టుకు కావలసిన అన్నీ పోషకాలు సమృద్దిగా అందుతాయి. తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు ఎంతో సాయినిగా మారుతుంది. అలాగే ఇదే మిశ్రమంలో కొబ్బరి నూనె కూడా బదులుగా నువ్వుల నూనె వేసి ఉపయోగిస్తే జుట్టుకు స్కాల్ సమస్య తగ్గుతుంది. పొడిబారకుండా జుట్టు కుదుళ్ల నుంచి ఒత్తుగా మారడానికి సహాయ పడుతుంది. ముఖ్యంగా తమలపాకులో ఉండే విటమిన్ సి, మరియు సల్ఫర్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Also Read:TDP:కడపలో టీడీపీ పరిస్థితేంటి?

- Advertisement -