ఇది తెలుసా…పోసానికి ఏపీలో కీలక పోస్ట్‌

273
- Advertisement -

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ సీఎం జగన్‌ ప్రభుత్వం కీలకమైన పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. తాజా ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇతర నియమ నిబంధనలు అపాయింట్‌మెంట్‌ వివరాలు ప్రత్యేకంగా వెల్లడించనున్నట్టు ప్రకటించారు.

సినీ రచయితగా కెరీర్‌ను ప్రారంభించి నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపన తర్వాత జగన్‌మోహన్‌ రెడ్డికి మద్దతు తెలుపుతూ వచ్చారు. పోసాని గత ఎన్నికల్లో వైకాపా తరపున ప్రచారం చేశారు.

ఇవి కూడా చదవండి..

ఏపీ సీఎంతో అలీ భేటీ..ఎందుకో తెలుసా?

పవన్‌ ఇంటి వద్ద రెక్కీ..పీఎస్‌లో ఫిర్యాదు

చీకోటి ప్రవీణ్‌తో ఆర్జీవీ భేటీ!

- Advertisement -