- Advertisement -
ఏపీ సీఎం జగన్‌తో సినీ నటుడు అలీ భేటీ అయ్యారు. తన కూతురు వివాహానికి రావాల్సిందిగా భార్య జుబేదాతో కలిసి మొదటి శుభలేఖను సీఎం జగన్‌మోహన్ రెడ్డికి అందజేశారు. పెళ్లిపత్రిక స్వీకరించిన జగన్, అలీతో తప్పకుండా వివాహానికి వస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది.
2019లో వైసీపీలో చేరిన అలీ… ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుడిగా నియమితుడయ్యారు. ఇక ఈ వివాహా వేడుకకు ప్రధాన రాజకీయపార్టీల నేతలంతా హాజరవనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే హైదరాబాద్ లోని ఒక హోటల్లో కుటుంబం మరియు కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ఫాతిమా ఎంగేజ్మెంట్ ని అట్టహాసంగా జరిపించారు.
ఇవి కూడా చదవండి..
మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే
మట్టికుస్తీతో వస్తున్న విష్ణు విశాల్
మూడో విజయం నమోదు చేసుకున్న భారత్
- Advertisement -

