జనాభా లెక్కల సేకరణపై సీఎస్ ఎస్‌కే జోషి సమీక్ష

467
- Advertisement -

2021 జాతీయ జనాభా లెక్కల సేకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 71,136 ఎన్యూమరేటర్ల ద్వారా జనాభా లెక్కల సేకరణకు జరుగుతున్న ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 65 మంది మాస్టర్ ట్రేనర్లకు యం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. లో మొదటి విడత శిక్షణ ముగిసిందని , రెండవ విడత నేటి నుండి 7వ తేది వరకు జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

జనవరి 2020 లో దాదాపు 2,000 మంది ఫీల్డ్ ట్రేనర్లకు మాస్టర్ ట్రేనర్లు శిక్షణ ఇస్తారని అన్నారు. వీరు ఎన్యూమరేటర్లు , సూపర్ వైజర్లకు ఎప్రిల్ లో శిక్షణ ఇస్తారు. జనాభా లెక్కల సేకరణ లో భాగంగా House Listing and Housing Census , Population Enumeration లతో పాటు నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ ను అప్ డేట్ చేస్తారని అన్నారు. ఈ లెక్కల సేకరణ వల్ల వ్యక్తుల వివరాలతో పాటు , సోషియో, కల్చరల్ , డెమొగ్రాఫిక్ మరియు ఆర్దిక వివరాలను సేకరించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. జనాభా లెక్కల సేకరణ ను మొబైల్ ఆప్ ద్వారా, పేపర్ షెడ్యూలు ద్వారా సేకరిస్తారని, ఎన్యూమరేషన్ బ్లాకులుగా ఏర్పాటు చేసి , చార్జ్ ఆఫీసర్ల ను నియమిస్తారని తెలిపారు.

telangana

డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ కె.ఇలంబర్తి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను కమిటీ కి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల పై సహకారం అందించాలని కోరారు. ఈ జనాభా లెక్కలు గ్రామాలు , పట్టణాలకు సంబంధించి ప్రైమరీ సోర్స్ గా పనిచేస్తాయని , విద్యా , వైద్య , భాష , ఆర్ధిక, డెమోగ్రాఫిక్ తదితర వివరాలను తెలుపుతాయని అన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, శాంతి కుమారి, అధర్ సిన్హా, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ , అర్ధిక శాఖ ఉన్నత అధికారి శివశంకర్ , విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి , Director of Census ఆపరేషన్స్ ఇలంబర్తి , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్ , పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు , మున్సిపల్ శాఖ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి, గెజిటీ ర్స్ డైరెక్టర్ కిషన్ లతో పాటు ప్లానింగ్ , మీ సేవ తదితరులు పాల్గొన్నారు.

Population Of Telangana 2020…Population Of Telangana 2020

- Advertisement -