పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. అర్ధరాత్రి నుండి అమలు..

362
Rtc ED

పెరిగిన ఆర్టీసీ చార్జీలు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమల్లోకి వస్తాయని సిటీ ఈడి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆర్డినరి బస్ మినిమం టికెట్ ఐదు రూపాయలున్న రేట్ పది రూపాయలకు పెరుగుతుంది.
మెట్రో టికెట్ యధావిధిగా పదిరూపాయలు ఉంటుందని తెలిపారు.

ఏసీ బస్ టికెట్ల రేట్లు పెంచడం లేదని.. ఎందుకంటే ఇప్పుడే వాటి రేట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు ఎక్కడం లేదని ఆయన తెలిపారు. పెంచితే ఇంకా ఆదరణ తగ్గుతుందని భావించి పెంచడం లేదని తెలిపారు. 23 కిలోమీటర్ల అనంతరం పది రూపాయలు ఏసీ బస్సులు మినహా అన్నింటిలో పెంచుతున్నమని అన్నారు.అదే విధంగా బస్ పాస్ రేట్లు కూడా పెంచినట్లు ఆర్టీసీ ఈడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

The revised TSRTC bus fare by the government of Telangana will come into effect from today midnight. According to a release, the minimum fare in..