ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత….

143
kakarla
- Advertisement -

ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు ఇకలేరు. నెల రోజుల క్రితం కిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్‌ పట్టా పొందారు.

1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు.

1970లో సుబ్బరావు మళ్లీ అమెరికా వెళ్లారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వారి ఫెల్లో ఆఫ్‌ రాయల్‌ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోని అనేక అసుపత్రులలో పనిచేశారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్ నార్త్‌ అమెరికా తొలి అధ్యక్షుడిగా సేవలందించారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. నిమ్స్‌లోని అన్ని విభాగాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటైన స్థాయికి నిమ్స్‌ను తీసుకొచ్చారు. వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందారు.

- Advertisement -