వివాహ బంధంతో ఒక్కటైన పూనమ్‌-సామ్‌

338
Poonam Pandey
- Advertisement -

బాలీవుడ్‌ నటి పూనమ్ పాండే పెళ్లిపీటలెక్కింది. సుమారు రెండేళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబే‌తో సహజీవనం చేసిన పూనమ్ బాంద్రాలోని వారి ఇంటిలో వివాహం చేసుకున్నారు. జూలై 27న బాయ్‌ప్రెండ్‌ సామ్‌తో పూనమ్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్న రెండు నెలల్లోనే పెళ్లి పీటలు ఎక్కి సామ్‌తో ఏడడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్ 2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. దీని కారణంగానే సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ సంపాదించారు. ఇక ఈ వివాహ వేడుకలో బ్లూ లెహంగా, పింక్‌ దుప్పట్టా ధరించి భర్త సామ్‌ బాంబే చేయి పట్టుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నది పూనమ్‌పాండే. ‘ఏడేడు జన్మాల్లో నీ సహచర్యాన్ని అభిలాషిస్తున్నా’ అంటూ భర్త సామ్‌ను ఉద్దేశిస్తూ భావోద్వేగంగా వ్యాఖ్యానించింది పూనమ్‌పాండే. వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -