నటి శ్రావణి కేసులో కీలక మలుపు..!

184

తెలుగు టీవీ‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దేవరాజ్‌తోపాటు సాయికృష్ణారెడ్డిని కూడా శ్రావణి ప్రేమించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తొలుత సాయితో ప్రేమలో పడిన శ్రావణి, ఆ తర్వాత దేవరాజ్ పరిచయం కావడంతో సాయిని దూరం పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే సాయి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

తాజాగా ఈ కేసులో కీలక ఆధారమైన సీసీటీవీ వీడియో బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. సెప్టెంబర్ 7న దేవరాజ్ రెడ్డితో కలిసి శ్రావణి పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్కు వెళ్లినట్లు.. అక్కడికి వచ్చిన సాయి కృష్ణారెడ్డి వచ్చి వారితో గొడవకు దిగినట్లు.. ఆ తర్వాత ఆటోలో ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. అందులో దేవరాజుపై సాయి దాడి చేయడం.. శ్రావణిపై చేయి చేసుకోవడం వీడియోలో కనిపించింది. హోటల్ లో గొడవ జరిగిన మరుసటి రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు.

అయితే ఈ కేసులో కొత్త పేరు వినిపిస్తోంది.ఓ ‘ సినీ నిర్మాతతో సహజీవనం చేయాలంటూ సాయి శ్రావణిని వేధించాడని దేవ్ రాజ్ ఆరోపిస్తున్నాడు. శ్రావణి సూసైడ్ కి కారణం ఎవరు? శ్రావణి కేసులోకి ఆ సినీ నిర్మాత పేరు ఎందుకు వచ్చింది? అని అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే పోలీసులు సాయి మరియు అశోక్ రెడ్డితో మరింత లోతుగా విచారించిన తర్వాత ఈ కేసులో అసలు నిజాలు బయకొస్తాయని తెలుస్తోంది.