బాలీవుడ్ భామ పూనమ్ పాండే భర్త సామ్ బోంబేపై కేసు పెట్టింది. సామ్ తనను వేధించాడని, హింసించాడని, తనపై దాడి చేశాడని పూనమ్ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సామ్‌ను అరెస్ట్ చేశారు. సామ్‌ను దక్షిణ గోవాలోని కనకోనలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుత పూనమ్ పాండే అక్కడ ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారని వెల్లడించారు.
‘నా భర్త సామ్ బాంబే నన్ను వేధింపులకు గురిచేస్తున్నాడు. దాడిచేసి అనంతరం బెదిరించాడు అని పాండే సోమవారం ఫిర్యాదు చేశారు. సామ్‌బాంబేను అరెస్ట్ చేశాం’ అని కెనకోనా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తుకారాం చవాన్ చెప్పారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయించినట్లు తెలిపారు.
పూనమ్ పాండే, సామ్ బోంబేల వివాహం పది రోజుల క్రితం జరిగింది. తనకు పెళ్లయిన విషయాన్ని, భర్తతో తాను తీసుకున్న ఫొటోలను పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలాగే, గోవాలో హనీమూన్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేశారు.