రెచ్చిపోయిన సంజూ శాంసన్‌..

170
Sanju Samson

ఐపీఎల్‌-13లో భాగంగా సీఎస్‌కే తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ బ్యాట్‌తో రెచ్చిపోయాడు. సీఎస్‌కే బౌలర్లను చితక్కొడుతూ చుక్కలు చూపించాడు. యశస్వి జైస్వాల్‌(6) ఔటైన తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ ఆదినుంచి రెచ్చిపోయి ఆడాడు. పేసర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో అలవోకగా సిక్సర్లు బాదేశాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో కేవలం 19 బంతుల్లోనే ఒక ఫోర్‌, 6 సిక్సర్లతో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు.

స్పిన్నర్‌ పియూశ్‌ చావ్లా వేసిన 8వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాది 21 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌..శాంసన్‌కు సహకారం అందించాడు. కొద్దిసేపటికి ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి చాహర్‌ చేతికి చిక్కాడు. 74: 32 బంతుల్లో 1ఫోర్‌, 9సిక్సర్లు పరుగుల వరద పారించాడు. దీంతో 132 పరుగుల వద్ద రాజస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న స్టీవ్‌ స్మిత్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.