పూజా హెగ్డె వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాప్ హీరోల సరసన చేస్తూ చిన్న హీరోల మూవీలో కూడా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. వరుణ్ తేజ ముకుంద సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈభామ ఆతర్వాత నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేయగా..ఆమూవీ నిరాశ పరిచింది. ఈమూవీ తర్వాత అమ్మడుకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయి. దీంతో తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమా డిజాస్టర్ గా మిగలడంతో ఆమె దారులన్ని ముసుకుపోయాయి.
కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి పూజా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత మహేష్ ‘మహర్షి’తో మరో హిట్ అందుకుంది.
ప్రస్తుతం పూజా హెగ్డె వరుణ్ తేజ్ సరసన వాల్మీకి సినిమాలో నటిస్తుది. ఈసినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈసినిమా టీజర్ ను విడుదల చేశారు. తాజాగా పూజా హెగ్డె ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు చిత్రయూనిట్. ఈసినిమాలో పూజా క్యారెక్టర్ పేరు శ్రీదేవి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది.