స్టార్ క్యాంపెయినర్‌..కానీ ఆ మంత్రి ఎక్కడా!

10
- Advertisement -

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధానంగా పోరు కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య ఉండగా ఇరు పార్టీలు ప్రచారంలో దూసుకెపోతున్నాయి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కానీ ప్రచారంలో మాత్రం కనిపించడం లేదు.

ఇందుకు కారణం..ఆయన నోటి దురుసుతనమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పొన్నం నోటి దురుసుతో పార్టీకి నెగటివ్ ఇమేజ్ వస్తోందని హైకమాండ్ ఆదేశాలతో ఆయనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం. అడ్లూరి లక్ష్మణ్‌ను “దున్నపోతు” అని తిట్టడంతో పార్టీ లోపలే పెద్ద కలకలం రేగింది.

మరోవైపు భర్తను కోల్పోయిన బాధలో మాగంటి గోపీనాథ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను “డ్రామా” అంటూ అవమానించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కేడర్‌లోనే చీలికలు కనిపిస్తున్నాయి.

జూబ్లీహిల్స్ ప్రాంతంలో మహిళా ఓటర్లలో ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉందని పార్టీ అంతర్గత సర్వేలు చెబుతున్నాయి. దీంతో పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ నేతలు ప్రచారానికి కొద్దిరోజులు దూరంగా ఉండండి అని పొన్నం ప్రభాకర్‌కి సూచించినట్లు సమాచారం. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read:కాంగ్రెస్ పాలనపై ఎన్నారైల నిరసన

- Advertisement -