TTD:స్థానిక ఆల‌యాల్లో దీపావళి ఆస్థానం

10
- Advertisement -

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యం, కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యాల్లో అక్టోబ‌రు 20వ తేదీ దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు దీపావ‌ళి ఆస్థానం నిర్వహించ‌నున్నారు.దీపావళి సందర్భంగా సోమ‌వారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

Also Read:కాంగ్రెస్ పాలనపై ఎన్నారైల నిరసన

- Advertisement -