- Advertisement -
నవంబర్ 3వ తేదీ నుండి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోతే బంద్ తప్పదని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల హెచ్చరిక జారీ చేసింది.
హామీ ఇచ్చినట్లుగా నవంబర్ 1వ తేదీ లోపు రూ.900 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుకు వినతి పత్రం అందజేశాయి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు.
ఇస్తామన్నది 600 కోట్లు.. ఇచ్చింది 200 కోట్లు అని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో దసరా లోపు రూ.600 కోట్లు చెల్లిస్తామని చెప్పి, ఈ రోజు రూ.200 కోట్లు మాత్రమే చెల్లించింది ప్రభుత్వం.
Also Read:కాంగ్రెస్ పాలనపై ఎన్నారైల నిరసన
- Advertisement -

