రామ్ ‘స్కంద‌’ పై రాజకీయం?

19
- Advertisement -

రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా వ‌స్తున్న సినిమా ‘స్కంద‌’. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ కావాలి. కానీ, ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవ్వబోతుంది. ఐతే, ఈ పోస్ట్ ఫోన్ వ్యవహారం వెనుక చాలా లొసుగులు ఉన్నాయి. అసలు టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ రాజకీయాలు పెరిగిపోయాయి. స్కంద‌ సినిమా తెర వెనుక ఏదో జరుగుతోందన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను హోల్ సేల్ గా ఓ బయ్యర్ కొనాలని అనుకున్నారు. అప్పటి నుంచి ఈ రాజకీయాలు, తెరవెనుక మంతనాలు మొదలయ్యాయంటూ టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్.

హోల్ సేల్ అమ్మకం జరిగిన తర్వాత కొన్నాళ్ల క్రితం ఆంధ్రలో తలొకరు తలో ఏరియాకు చకచకా ఫిక్స్ అయ్యారు. బోయ‌పాటి శ్రీను గత సినిమా ‘అఖండ’ అద్భుత విజయం సాధించడంతో ‘స్కంద‌’ సినిమా పై భారీగా డిమాండ్ పెరిగింది. అందుకే బయ్యర్లు ఈ సినిమా కోసం ఇంట్రెస్ట్ చూపించారు. కానీ, సినిమా అవుట్ ఫుట్ పై బోలెడు నెగిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు బయ్యర్లు కూడా నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ మీద కాకుండా కేవలం అడ్వాన్స్ మీద పంపిణీకి వెళ్లేలా తెర వెనుక రాజకీయాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక థియేటర్ల కేటాయింపు వ్యవహారం మామూలే.

Also Read:సైంధవ్‌లో ఆర్య!

పైగా స్కంద‌ సినిమాకు పెద్దగా పోటీ లేకుండా చూడలని చూస్తున్నారు. అలా చూస్తే.. కీలకమైన థియేటర్లు అన్నీ స్కంద‌కే దొరుకుతాయి. ఈ దిశగా కూడా కొన్ని రాజకీయాలు నడుస్తున్నాయి. మొత్తానికి స్కంద‌ సినిమా విడుదల దగ్గరకు వస్తే మొత్తం వ్యవహారాలు అన్నీ క్లారిటీగా బయటకు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది. రాజకీయాలు ఏ మేరకు ఫలించాయో..ఏ మేరకు ఫలించలేదో అన్నది. ఏది ఏమైనా స్కంద‌ బ్లాక్ బస్టర్ రేంజ్ లో వుంటే ఈ రాజకీయాలు అన్నీ పటాపంచలైపోతాయి.

Also Read:మురళీధరన్ కోసం సచిన్!

- Advertisement -