కాంగ్రెస్ విన్నింగ్ స్ట్రాటజీ అతనిదే !

46
- Advertisement -

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ చిరస్మరణీయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కనీ వినీ ఎరుగని రీతిలో ఏకంగా 135 స్థానాలను హస్తం పార్టీ హస్తగతం చేసుకొని రాచమార్గంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే కాంగ్రెస్ ఇంతటి ఘనవిజయం సాధించడానికి కారణం ఏంటి ? ఎలాంటి వ్యూహాలను అమలు చేసింది ? ఇంతకీ కాంగ్రెస్ వ్యూహకర్త ఎవరు ? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

కర్నాటకలో కాంగ్రెస్ బలం బాగానే ఉన్నప్పటికి.. బిజెపి, జెడిఎస్ వంటి పార్టీల ప్రభావం కూడా గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునిల్ కనుగోలు చేసిన వ్యూహరచన ఆ పార్టీ విజయతీరాలకు చేరించిదనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. బళ్లారిలో పుట్టిన సునిల్.. గతం లో 2014 ఎన్నికల్లో మోడి రాజకీయ వ్యూహకర్తల టీంలో ఒకరిగా పని చేశారు. అలాగే 2019లో స్టాలిన్ పార్టీ 38 ఎంపీ సీట్లు గెలుచుకోవడం వెనుక కూడా సునిల్ వ్యూహరచనే ప్రధాన కారణం. అలాంటి సునిల్ కనుగోలు… కర్నాటకలో కాంగ్రెస్ తరుపున ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా ఎన్నికైన తరువాత వ్యూహత్వంకంగా ప్రణాళికలు రచిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. అలాగే గతంలో బిజెపి తరుపున పనిచేయడంతో ఆ పార్టీ బలాబలహీనతలను అంచనా వేసి వ్యూహాత్మకంగా దెబ్బతీయడంలో సునిల్ కనుగోలు పాత్రే అధికం.

Also Read:మదర్స్ డే.. అమ్మ కు ప్రేమతో

ఇక కన్నడ ప్రజల దృష్టి కాంగ్రెస్ పై పడడానికి మరో రీజన్ ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో.. అన్నీ వర్గాల వారిని ఆకర్షించేలా మేనిఫెస్టో రూపొందించడంలో సునీల్ సలహాలే కీలకం అనేది కర్నాటక పోలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. గృహజ్యోతి పేరిట ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, యువనిధి పేరుతో నిరుద్యోగులకు మూడు వేల రూపాయల భృతి, భజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలపై ఉక్కుపాదం వంటి ఎన్నో అంశాలు కన్నడ ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. దాంతో కాంగ్రెస్ కు ఊహించిన దాని కంటే మరింత ప్రజాదరణ లభించడంతో ఘనవిజయాన్ని నమోదు చేసింది. మొత్తానికి సునీల్ కనుగోలు రాజకీయ వ్యూహాలు హస్తం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -