న్యూ ఇయర్… పోలీసుల నిఘా!

1
- Advertisement -

నూతన సంవత్సరానికి మరి కొద్దిగంటలు మాత్రమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా నూతన సంవత్సర పార్టీల విషయంలో ఎవరూ గీత దాటినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా న్యూ ఇయర్‌ కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు అని పోలీసులు స్పష్టం చేశారు. మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలన్నారు. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు పోలీసులు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్‌ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మించి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు.

ఇక నూతన సంవత్సరం సందర్భంగా డ్రంక్‌ డ్రైవింగే కాదు డ్రగ్‌ డ్రైవింగ్‌ పై ప్రత్యేక దృష్టి సారించారు. జర్మనీ నుంచి తెప్పించిన 75 పరికరాలను తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (టీఎస్‌ ఏఎన్‌బీ) అధికారులు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండలకు అందించారు. వీటి ఆధారంగా అధికారులు రహదారులపైనే కాకుండా పబ్స్‌, ఫామ్‌హౌస్‌లతో పాటు మరికొన్ని సున్నిత ప్రాంతాల్లోనూ తనిఖీలు చేయనున్నారు.

Also Read:Chandrababu:రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు

- Advertisement -