- Advertisement -
సినీ నటి కరాటే కల్యాణి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు, పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీలో శ్రీలక్ష్మినిలయం అపార్ట్‌మెంట్స్‌లో సోదాలు నిర్వహించగా ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరు.
తన కుమార్తె ఒక బాబు (12 ఏళ్లు)ను, ఐదు నెలల పాపను పెంచుకుంటోందని, అందులో తప్పేముందని ప్రశ్నించింది. అయితే వారిని ఎక్కడనుంచి తెచ్చిందనే విషయం మాత్రం తనకు తెలియదని తెలిపారు కల్యాణి తల్లి.
కళ్యాణి గత కొన్నేళ్ళుగా అక్రమంగా పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతుందని 1098 నెంబర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు,పోలీసులు సోదాలు నిర్వహించారు.
- Advertisement -