తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి తమ స్వస్థలాలకు బయలుదేరుతున్నారు ప్రజలు. దీంతో ప్రయాణీకులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. ప్రజల కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి.
అయితే ఊర్లలోకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దొంగనాలు జరిగే ఆస్కారం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇళ్లల్లో చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల సూచించారు. గస్తీని పెంచి దొంగతనాలు జరగకుండా పోలీసు శాఖ తరపున చర్యలు చేపట్టామని, విలువైన నగలు, డబ్బులను ఇంట్లో ఉంచకుండా లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు.
ఊరికి వెళ్లే సమయంలో దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మెయిన్ డోర్ కు వేసిన తాళం కనిపించకుండా ఉండేలా కర్టెన్లు అడ్డుగా ఉంచాలన్నారు.
Also Read:KTR:వికాసం వైపుకు తెలంగాణ..కేసీఆర్‌దే ఘనత