పతంగులు ఎగురేసుడు బంద్‌…

54
- Advertisement -

సంక్రాంతి పండుగను పురస్కరించుకోని నగరంలోని పలు ప్రాంతాల్లో పతంగులను ఎగురవేయడాన్ని నిషేధించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నగర సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 14న ఉదయం 6గంటల నుంచి 16వ తేదీ ఉదయం 6గంటల వరకు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

బహీరంగ ప్రదేశాల్లో డీజే సౌండ్లు పెట్టకూడదని ఆదేశించారు. వాణిజ్య ప్రాంతాల్లో 65డెసిబుల్స్ రాత్రి సమయాల్లో 55డెసిబుల్స్‌ నివాస ప్రాంతాల్లో 55డెసిబుల్స్‌ ధ్వని తీవ్రత పెరగకుడదన్నారు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఎలాంటి లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించరాదని పేర్కొన్నారు.

పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లలు డాబాలపై ఎగురవేసే సమయంలో విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. గోడ‌ల‌పై నిల్చుని ప‌తంగులు ఎగుర‌వేయొద్ద‌ని సూచించారు.

ఇవి కూడా చదవండి…

పదిలో స్వల్పంగా మార్పులు..

స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

తగ్గిన పసిడి ధరలు…

- Advertisement -