అశ్వత్థామరెడ్డిపై పోలీస్ పిర్యాదు..

483
tsrtc jac
- Advertisement -

తెలంగాణలో గతకొద్ది రోజుల నుండి ఆర్టీసీ అధికారులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ సంస్థ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాడాని, అనేక మంది కార్మికుల ఆత్మహత్య లకు కారణమయ్యాడని ఆరోపిస్తూ కూకట్ పల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోరేటి రాజు కూకట్ పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా.. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం ఆర్టీసీ అంతమే అని సీఎం కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పేశారు కాబట్టి… ఇక ఆర్టీసీ యూనియన్లు చేయగలిగేదేమీ లేనట్లే.

Ashwathama Reddy

ఇక హుజూర్‌నగర్ గెలుపు కారణంగా… ప్రజలు తమతోనే ఉన్నారంటున్న కేసీఆర్… ఇక ఏమాత్రం ఈ విషయంలో రాజీ పడటమూ, వెనక్కి తగ్గడం వంటివి ఉండవన్నది సుస్పష్టం అయింది. అందువల్ల ఇప్పుడు తేల్చుకోవాల్సింది సమ్మె చేస్తున్న యూనియన్లూ, కార్మికులే. ఇప్పటికీ కార్మికులను వెనక్కి వచ్చేయమని సీఎం కేసీఆర్ పిలుపు ఇవ్వడం… వారికి ఓ ఛాన్స్ ఇచ్చినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

- Advertisement -