నిర్మాత కొడుకుపై దాడి చేసిన పోలీసులు

434
Producer Natiikumar
- Advertisement -

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ కుమారుడిపై దాడి చేశారు పంజాగుట్ట పోలీసులు. బేగంపేట కంట్రి క్లబ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బేగంపేట కంట్రిక్లబ్ లోకి వెళుతున్న నట్టికుమార్ తనయుడు క్రాంతిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. పైగా కారు పార్క్ చేస్తామంటూ కారు తాళాలు తీసి దగ్గర పెట్టుకున్నారు. దీంతో క్రాంతి వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు క్రాంతి వద్దకు వెళ్లి అతనిపై దాడి చేశారు. డయల్ 100కు ఎందుక ఫోన్ చేశావ్ అంటూ అతనిపై దాడికి పాల్పడ్డారు.

  క్రాంతి తన తండ్రి నట్టికుమార్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్న నట్టికుమార్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో దిగొచ్చిన పోలీసులు క్షమాపణలు చెప్పడంతో ఆయన శాంతించారు.కంట్రీక్లబ్‌లో ‘బ్యూటిఫుల్’ సినిమాను ప్రమోషన్ చేస్తామని ఈవెంట్ మేనేజర్ చెప్పినా, ప్రమోషన్ చేయలేదని నట్టి కుమార్ ఆరోపించారు. కంట్రీ క్లబ్ ఈవెంట్ మేనేజర్ సుమన్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -