వైట్ టీషర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు సాయం చేయడం లేదని, సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడడానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాహుల్ ప్రకటించారు.
ఈ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రజలకు ఆర్థిక న్యాయంపై నమ్మకం ఉంటే, పెరుగుతున్న సంపద అసమానతలను వ్యతిరేకించాలని అన్నారు. శాంతి, స్థిరత్వం కోసం పోరాడాలని కోరారు. తెల్ల టీ షర్టులు ధరించి ఉద్యమంలో పాల్గొనండని చెప్పారు.
మోదీ ప్రభుత్వం పేదలు, శ్రామిక వర్గాలను పట్టించుకోవడం లేదని అన్నారు. వారిని వారి ఇష్టానికే వదిలేసిందని విమర్శించారు. కొంతమంది పెట్టుబడిదారులను మరింత సంపన్నం చేయడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి న్యాయం చేయడానికి, హక్కుల కోసం గట్టిగా గళం విప్పడం మనందరి బాధ్యత అని అన్నారు. అందుకోసమే తాము వైట్ టీ షర్ట్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నానని.. పూర్తి వివరాల కోసం https://whitetshirt. in/home/hin చూడాలని లేదంటే 9999812024 నంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు.
Also Read:నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎన్నారైల పాత్ర కీలకం