ప్రజా పాలనా…నిర్బందాల పాలనా?

8
- Advertisement -

ప్రజా పాలన ముసుగులో తెలంగాణలో నిర్బంధాల పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న A to Z స్కాములను ప్రశ్నిస్తూ హోర్డింగ్ పెట్టినందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసి, బీఆర్ఎస్ కార్యకర్త సాయి కిరణ్ మాదిగను టాస్క్ ఫోర్స్ పోలీసులు తన ఇంటి నుంచి తీసుకుపోయారు.

సాయి కిరణ్ మాదిగ ఎక్కడ ఉన్నాడో ఇప్పటివరకు తన కుటుంబ సభ్యులకు సైతం చెప్పని పోలీసులు.. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే.. సాయి కిరణ్ ఆచూకీ తెలుసుకునే హక్కు కుటుంబానికి లేదా? దాదాపు 24 గంటలుగా సాయి కిరణ్ అదృశ్యమయ్యాడు.

మరోవైపు, కంటోన్మెంట్‌కు చెందిన మరో బీఆర్ఎస్ సభ్యుడు కళ్యాణ్ సందీప్ ఇంటికి సైతం టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు.ప్రజా పాలన అంటే హత్య కేసుల దర్యాప్తు వదిలేసి, ప్రతిపక్ష పార్టీ సభ్యులను వేధించడమా?,హోర్డింగ్ పెట్టిన నలుగురు కార్మికులను సైతం నిర్బంధించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ వెంటనే రంగంలోకి దిగి, లాయర్ల ద్వారా కార్మికులను విడిపించింది.

Also Read:బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం:ఏపీ మంత్రి

సాయి ఎక్కడ ఉన్నాడనే విషయంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ నిన్న రాత్రి నుంచీ పోలీసులతో ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. అయినా ఆచూకీ చెప్పని పోలీసులు …హోంమంత్రి పదవిని తన దగ్గరే పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేసి, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్న ఈ రేవంత్ సర్కార్ తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -