తాను ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కలిసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాను నారా లోకేష్‌ను కలవలేదు… లోకేష్‌ను చీకట్లో కలిశాను అని రేవంత్ రెడ్డి గాలి గన్నయ్య మాటలు మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు.
నేను ఏది చేసినా బాజప్తా చేస్తా బేజాప్తా చేయను… లోకేష్ నా తమ్ముడు లాంటి వాడు ఒకవేళ కలిస్తే తప్పేంటి.. లోకేష్ ఏమైనా రేవంత్ రెడ్డి సంచులు మోసిన దొంగ కాదుగా, లోకేష్ నీలాగా చదువు రాని వాడు కాదుగా అన్నారు. లోకేష్ మీ పెద్ద బాస్ కొడుకే కదా ఏదో దావూద్ ఇబ్రహీం, గుండా చీకట్లో కలిశాను అని ప్రచారం చేస్తున్నవ్ ఏందిరా హౌలా … పంది ఎంత బలిసినా నంది కాదు అన్నారు.
నువ్వు సీఎం అయ్యి ఉండొచ్చు.. కానీ ఎన్నటికీ నీ బ్రతుకు ఒక పెండ పురుగు బ్రతుకే తప్ప నీది కేసీఆర్ స్థాయి కాదు అన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ముగ్గురు మొనగాళ్లలా తిరుగుతున్నారు … ఓ మంత్రి బాంబులు బాంబులు అంటూ తిరుగుతున్నారు.. ఆయన ఇంటి పేరు పొంగులేటి కాదు బాంబులేటి అయింది అన్నారు.
Also Read:బీసీలకు రిజర్వేషన్లు.. చట్టబద్ధత కావాలి
ఇంకొకాయన కమీషన్ల మంత్రి భట్టి.. ఆయన కమీషన్లు తీసుకోవడంలో బిజీగా ఉన్నాడు… ఎరువుల దుకాణాల ముందు చెప్పులు, ఆధార్ కార్డులు పెడితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఏం చేస్తున్నాడు? – కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒక కిట్టి పార్టీ ఆంటీ లాగా తయారయ్యాడు అని దుయ్యబట్టారు.

