అబద్దాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో బనకచర్ల అంశం అసలు చర్చకే రాలేదని..అలాంటప్పుడు దానిని ఆపాలనే చర్చ ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పారు రేవంత్.
అయితే దీనిపై అప్పుడు స్పందించారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. బనకచర్లపై చర్చ జరిగిందని చెప్పారు. తాజాగా మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు రామానాయుడు. మొన్న ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని చంద్రబాబు గారు చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డికి చెప్పారు అన్నారు.
సముద్రంలో నీరు వృధాగా కలిసిపోయే నీటిని ఉపయోగించుకొని పోలవరం, బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు రాయలసీమకు రిజర్వ్ చేస్తాము అని తెలిపారు రామానాయుడు. దీంతో రేవంత్ చెప్పింది అబద్దమని తేలిపోయింది.
Also Read:TRFను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా

