షా వీడియో మార్ఫింగ్..6గురు పోలీసుల అదుపులో

20
- Advertisement -

కేంద్ర హోం అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయగా వీరిలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి మన్నే సతీష్, నవీన్, తస్లీమాతో పాటు గీత, శివ, అస్మా ఉన్నారు. ఇక ఇదే కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సైతం నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.

పోలీసుల అరెస్ట్‌ను ఖండించారు కాంగ్రెస్ నేత వి హన్మంతరావు. అమిత్ షా మీకు ఒక న్యాయం.. మాకొక న్యాయమా?, తాను ఫిర్యాదు చేసి పదిరోజులైనా ఇంత వరకు స్పందించలేదని అన్నారు.నా క్యారెక్టర్ మీద దెబ్బకొట్టారు.. నేను రిజర్వేషన్లు గురించి మాట్లాడకుండానే నా వీడియో మార్ఫింగ్ చేశారని అమిత్ షా అంటున్నారు. ఢిల్లీ నుంచి పోలీసులు ఇక్కడిదాకా వచ్చి అరెస్టు చేయాలని చూస్తున్నారు. బీజేపీ తెలంగాణలో ఒక మ్యానిఫెస్టో.. ఆంధ్రాలో ఒక మ్యానిఫెస్టో పెట్టి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు.

Also Read:GIC:పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్‌ అరణ్య’

- Advertisement -