మద్యం షాపులు తెరుస్తారంటూ నకిలీ జీవో..అరెస్ట్

233
ts wines
- Advertisement -

తెలంగాణలో రెండు గంటల పాటు మద్యం షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో నకిలీ జీవో క్రియేట్ చేసి ప్రచారం చేసిన ఉప్పల్‌కు చెందిన యువకుడు సనీష్ కుమార్‌ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసత్య వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వివరాల్లోకి వెళ్తె…మార్చి 28న సోషల్ మీడియాలో కోవిద్ – 19 పేరుతో ఉన్న అకౌంట్‌లో మద్యం దుకాణాలు తెరుస్తున్నారంటూ ఓ పోస్టు కనిపించింది సనీష్‌కి. దీంతో దానిని ప్రభుత్వ జీవోగా మారుస్తూ తన స్నేహితుడైన మద్యం షాపు యజమానికి పంపించాడు.

ఆయన దానిని తన స్నేహితులకు ఫార్వర్డ్ చేయగా అది గంటల్లోనే రాష్ట్రమంతా చక్కర్లు కొట్టింది. తర్వాత అది ఫేక్ న్యూస్ అని అధికారులు తేల్చడంతో మందు బాబులు తీవ్ర నిరాశ చెందారు.

దీంతో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డ సీసీఎస్ పోలీసులు నిందితుడిని గుర్తించి కటకటాల వెనక్కి పంపారు.

- Advertisement -