ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 10 నుంచి 15 రోజుల్లో ఈ పర్యటన ఉండొచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా, బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుట్టే అవకాశముంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి దిశను ప్రజలకు తెలియజేయడంలో కీలకంగా మారనున్నాయి.
అలాగే, హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో భారీ ప్రజాసభ నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సభ ద్వారా పార్టీ శక్తిని ప్రదర్శించడమే కాకుండా, రాబోయే ఎన్నికలకు దిశానిర్దేశం చేయాలనే లక్ష్యంతో ఉంది.
Also Read:Shreyas:ఈసారి ట్రోఫీ మాదే!
ప్రత్యేకంగా GHMC ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మోదీ పర్యటన ద్వారా నగర రాజకీయాల్లో పార్టీ స్థితిని మరింత బలోపేతం చేయాలని యోచిస్తోంది.

