ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న వేళ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్‌కు ఈసారి టైటిల్ అందించడమే తనముందున్న టార్గెట్ అని తెలిపారు. ఈసారి టోర్నమెంట్‌లో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, అది నాకు నచ్చుతుంది. నేను సవాళ్లను ఇష్టపడతాను. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మైదానంలోకి దిగిన ప్రతిసారి గెలవాలి. నా దృష్టి ట్రోఫీపై ఉంది అని జెర్సీ లాంచ్ కార్యక్రమంలో శ్రేయస్ చెప్పారు.
గత అక్టోబర్‌లో ఆస్ట్రేలియా టూర్ సమయంలో గాయపడ్డ శ్రేయాస్ రెండు నెలలకు పైగా క్రికెట్‌కు దూరమయ్యాడు. తర్వాత ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతూ తిరిగి ఫిట్‌నెస్ సాధించారు. అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా పాల్గొన్నారు.
Also Read:రవీంద్ర తేజ్.. ‘లవ్‌వాలా’
గాయం తర్వాత తిరిగి రావడం ఎప్పుడూ కష్టమే. నేను సుమారు 7 కిలోలు తగ్గిపోయాను. ఆ బరువును తిరిగి పెంచుకోవడానికి చాలా కష్టపడ్డాను. కానీ సవాళ్లు నాకు ఇష్టం. ఇప్పుడు మళ్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది అని అన్నారు.

