భయపడేవారు చనిపోయినట్టే!

6
- Advertisement -

కోల్‌కతాలోని రెడ్ రోడ్ వద్ద ఈద్ ప్రార్థనల అనంతరం వేలాదిమందిని ఉద్దేశించి ప్రసంగించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ సందర్భంగా, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ( SIR) పేరుతో ప్రజల ఓటు హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.

బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణ ద్వారా ప్రజల పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తోందని మమతా విమర్శించారు. ప్రజల పేర్లు తొలగించారు. ఈ విషయంలో నేను కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడాను. ప్రజల హక్కులు కాపాడబడతాయని ఆశిస్తున్నాను అని ఆమె అన్నారు.

బెంగాల్‌లోని అన్ని వర్గాల ప్రజలతో నేను ఉన్నాను. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను. మోదీ గారు మా హక్కులను కాజేయనివ్వం. మీరు మా ప్రభుత్వాన్ని బలవంతంగా నియంత్రించాలనుకుంటున్నారు, ప్రెసిడెంట్ రూల్ విధించాలనుకుంటున్నారు. అయినా మేము భయపడము.భయపడేవారు చనిపోయినట్టే… పోరాడేవారే జీవితంలో విజయం సాధిస్తారు అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Also Read:Shreyas:ఈసారి ట్రోఫీ మాదే!

బీజేపీ దొంగల పార్టీ, గూండాల పార్టీ, దేశద్రోహుల పార్టీ అన్నారు. ఓట్లను విభజించేందుకు కొందరు డబ్బులు తీసుకుంటున్నారని కూడా ఆమె ఆరోపించారు. మోదీ…బీజేపీ మీ ఓటు హక్కులను తీసుకుపోవడానికి మేము అనుమతించము. ప్రజాస్వామ్యం, ప్రతి పౌరుడి హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం అని మమతా స్పష్టం చేశారు.

- Advertisement -