ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరేసిన ప్రధాని..

44
- Advertisement -

ఎర్రకోటపై జాతీయజెండాను ఎగరేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని…దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్‌లకు మనం రుణపడి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతోందన్నారు.

అమృత్ మహోత్సవాల సందర్భంగా.. కొత్త దశ, దిశను ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన ముందున్న మార్గం కఠినమైందన్న ప్రధాని.. ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నామని.. ప్రధాని మోదీ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు.. భారత్ స్వతంత్రంగా మనుగడ సాగించలేదని.. ముక్కలు చెక్కలు అవుతుందన్నారని.. కానీ వారి అభిప్రాయం తప్పని నిరూపించామన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవుతున్నారన్నారు.

వచ్చే 25 ఏళ్లు మనం ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందడం అందులో మొదటిదని…ఐక్యమత్యంతో ప్రజలంతా ముందుకు వెళ్లాలన్నారు.

- Advertisement -