ప్రపంచ విశ్వాసానికి ప్రతీక:మోదీ

2
- Advertisement -

న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రైక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ ఏకగ్రీవంగా ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మధ్య వ్యూహాత్మక భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరి మద్దతుతో ఈ ఉమ్మడి ప్రకటనను తీసుకురావడం అంతర్జాతీయ వేదికపై భారత దౌత్య విజయాన్ని పెరుగుతున్న ప్రపంచ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీలో జరిగిన ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.బ్రైక్స్ కూటమిలోని పలు భాగస్వామ్య దేశాల మధ్య రకరకాల భౌగోళిక-రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, భారత్ నాయకత్వంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ పై ఏకాభిప్రాయం కుదరడం భారత దౌత్య శక్తికి అతిపెద్ద నిదర్శనమని మోదీ పేర్కొన్నారు.

సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితులు మరియు యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్ 7.8 శాతం జీడీపీ (GDP) వృద్ధి రేటును సాధించి వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోందని గుర్తుచేశారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా భారత్ “స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం మరియు సుస్థిరత” అనే ప్రాధాన్యతలతో పనిచేసిందని, అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరానికి ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చిపెట్టిందని కేంద్ర నాయకులు కొనియాడారు.విదేశాంగ వ్యవహారాలు, ఆర్థిక సహకారం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, డిజిటల్ టెక్నాలజీ మరియు ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో బ్రైక్స్ సభ్యదేశాలు స్పష్టమైన ఒప్పందానికి వచ్చాయి.

Also Read:మోదీ@76..ప్రముఖుల విషెస్

- Advertisement -