ప్రధాని మోదీ 76వ జన్మదినం సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు’గా అభివర్ణించారు. కొంతమంది ప్రపంచ నాయకులు ఆయనను “నవ భారత్” శిల్పిగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వాన్ని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. యోగి ఆదిత్యనాథ్ ఆయనను “ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు” మరియు “నవ భారత్” శిల్పిగా అభివర్ణించారు.
దేశమే ప్రథమం అనే పట్ల ప్రధాని మోదీకి ఉన్న అంకితభావం, ప్రజా సంక్షేమం “వికసిత్ భారత్” (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని సాధించడానికి స్ఫూర్తి అని అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా….శ్రీ మోదీ నాయకత్వంలోని అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, సమాజంలో చివరి వ్యక్తి ఎల్లప్పుడూ ఆయన పాలనకు కేంద్ర బిందువుగా ఉంటారు. ఒక తల్లి తన పక్కా ఇంటి ముంగిట నిలబడి ఆశీస్సులు ఇచ్చినప్పుడు, లేదా ఒక సోదరి ఆయుష్మాన్ కార్డ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడిందో పంచుకున్నప్పుడు, ఈ పథకాల నిజమైన అర్థం స్పష్టమవుతుంది. ముమ్మారు తలాక్ నుండి విముక్తి మరియు నారీ శక్తి వందన్ అధినియం మహిళలకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి, కాగా స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా మరియు నూతన విద్యా విధానం యువతకు అవకాశాల తలపులను తెరిచాయి. కోట్ల మంది ప్రజల జీవితాల్లో వచ్చిన ఈ మార్పే శ్రీ మోదీ గారి అతిపెద్ద సంపద అని కొనియాడారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం…”ప్రధాని @narendramodiకి శుభాకాంక్షలు తెలపడంలో, ఆయన విజయవంతమైన జీవితం, ఆరోగ్యకరమైన ఆయుష్షు మరియు మన ప్రజల సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకోవడంలో దేశం మరియు ప్రపంచంతో నేను భాగమవుతున్నాను. మీ ఆలోచనలు, విజయాల ద్వారా మీరు ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతూనే ఉన్నారు.”
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కూడా కోల్‌కతాలో జరిగిన ఒక సంభాషణలో మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, తిరుగుబాట్లు, ఘర్షణల ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశ జీడీపీ వృద్ధి 7.8 నుండి 8 శాతంగా ఉందంటూ, ప్రపంచ బ్యాంక్ గణాంకాలను ప్రస్తావిస్తూ మజుందార్ పేర్కొన్నారు.

