భట్టిపై ప్రేమ ఉంటే సీఎంని చేయి!

5
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వీడటంపై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ఆమె ధీటైన సమాధానమిచ్చారు.

గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహిళను ముఖ్యమంత్రిని చేస్తామని రాహుల్ గాంధీ ప్రతిపాదన తెచ్చిన సమయంలో.. నన్ను, డీకే అరుణను పక్కన పెట్టి, పార్టీ నుండి బయటకు పంపించే కుట్రలు చేసింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి? అని సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్‌లో ఉన్న మహిళా నాయకత్వాన్ని ఎదగకుండా తొక్కిపెట్టి, బయటకు వెళ్లేలా పరిస్థితులు కల్పించింది రేవంత్‌రెడ్డి మాత్రమేనని ఆమె ఆరోపించారు.

నువ్వు 2006లో ZPTCగా నీ రాజకీయం ప్రారంభించినప్పుడు.. నేను 2000వ సంవత్సరంలోనే కాంగ్రెస్‌ పార్టీ తరఫున సుదీర్ఘ సేవలు అందించాను. అలాంటిది ఈరోజు నువ్వు వచ్చి మాకు నీతి పాఠాలు చెప్పడం, కితాబులు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు అని తేల్చిచెప్పారు.

Also Read:తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచన

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై రేవంత్ రెడ్డి వ్యక్తపరుస్తున్న ప్రేమంతా నకిలీ అని సబిత ఎద్దేవా చేశారు. భట్టి విక్రమార్కపై అంత ప్రేమ, గౌరవం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రి పదవిని ఆయనకు అప్పగించి, ఆ సీట్లో కూర్చోబెట్టు.. ఎవరు వద్దన్నారు? అని సవాల్ విసిరారు. తమను కాంగ్రెస్ నుంచి గెంటేసి, ఇప్పుడు పార్టీ మారడంపై ఉచిత సలహాలు ఇవ్వడం రేవంత్ నైజానికి నిదర్శనమని ఆమె ధ్వజమెత్తారు.

- Advertisement -