ఎన్టీఆర్ పై మోడీ ప్రేమ.. వ్యూహమా ?

22
- Advertisement -

గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలు సీనియర్ ఎన్టీఆర్ పై అమితమైన ప్రేమ కనబరుస్తున్నారు. ఎన్టీఆర్ కు కాంగ్రెస్ అన్యాయం చేసిందని, ఆయనకు వెన్నుపోటు పొడిచిందంటూ మొసలి కన్నీరు కరుస్తున్నారు. అసలు బీజేపీ నేతలు కొత్తగా ఎన్టీఆర్ పేరు పదే పదే ప్రస్తావించడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలలో పలుసార్లు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. దీంతో అసలు ఎప్పుడేందుకు ఎన్టీఆర్ పేరును బీజేపీ తెరపైకి తెస్తోంది అన్న సందేహాలు రకామానవు. అయితే బీజేపీ ఏ పని చేసిన పార్టీ స్వలాభం కోసమే చూస్తుందనడంలో ఎలాంటి సందేహంలో ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం తేటతెల్లమైంది కూడా..

మరి అసలు ఎన్టీఆర్ ను తెరెపైకి తేవడం వెనుక బీజేపీ అసలు వ్యూహం ఏంటి అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నా చర్చ. ఎన్టీఆర్ యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రాన్ని వందరూపాయల నాణెంపై ముద్రించేందుకు కూడా మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన కుమార్తె కేంద్ర మంత్రి పురందేశ్వరి ద్వార అధికారులు సలహాలు, సూచనలు కూడా తీసుకున్నట్లు సమాచారం. మరి ఎప్పుడు లేని విధంగా ఇప్పుడేందుకు ఎన్టీఆర్ పై కమలనాథులు అమితమైన ప్రేమ కనబరుస్తున్నారు అంటే ఇది పక్కా రాజకీయ వ్యూహమే అని పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట.

ఎందుకంటే వచ్చే ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఎలాగైనా తెలుగు రాష్ట్రాలలో సత్తా చాటలని చూస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తటస్థ ఓట్లను ఎన్టీఆర్ సెంటిమెంట్ తో తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని కొందరి అభిప్రాయం. వంద రూపాయల కాయిన్ కు ఎన్టీఆర్ చిత్రాన్ని రూపొందించడం ద్వారా అటు ఏపీలో కు అన్న అభిమానుల నుంచి బీజేపీపై సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కాషాయపార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉందనే భావనతోనే మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇట్టే అర్థమైపోతుంది. అయితే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్న అందులో ప్రజలకు ఉపయోగపడే దానికన్నా ఆ పార్టీ స్వలాభామే అధికంగా ఉంటుందనే సంగతి యావత్ ప్రజానీకానికి తెలుసు. మరి కాషాయ పార్టీ అన్నగారి పై చూపిస్తున్న ప్రేమను ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది సందేహమే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -