ప్రణబ్ ముఖర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ మృతితో ఒక శకం ముగిసింది..ప్రణబ్ దేశానికి ఎన్నో రకాల సేవలు అందించారని తెలిపారు.గొప్ప కుమారుడు కన్నుమూతపై ఈ దేశం విలపిస్తోందన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం తెలిపారు.
భారతరత్న ప్రణబ్‌ను కోల్పోయి దేశం దుఃఖసాగరంలో ఉంది.గొప్ప రాజనీతిజ్ఞుడు, మేధావిని ఈ దేశం కోల్పోయింది.దేశాభివృద్ధిలో ప్రణబ్ ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు.రాజకీయాలు, వర్గాలకు అతీతంగా అందరికీ ప్రణబ్ ఆరాధ్యుడు.ప్రధాని బాధ్యతల స్వీకరణ సమయంలో ప్రణబ్ ఆశీర్వదించారు.
2014లో దిల్లీ వచ్చినప్పుడు ప్రణబ్ నాకు మార్గదర్శనం చేశారని తెలిపారు మోడీ.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై హోంమంత్రి అమిత్ షా తీవ్ర సంతాపం తెలిపారు.
ప్రణబ్ ముఖర్జీ మాతృభూమికి ఎనలేని సేవలు అందించారు.ప్రణబ్ మృతితో దేశం గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని తెలిపారు.