తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్‌ది కీలకపాత్ర: కేటీఆర్

106
pranab

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీది కీలక పాత్ర అన్నారు మంత్రి కేటీఆర్. భారత మాజీ రాష్ట్రపతి భరత్ రత్న ప్రణబ్ ముఖర్జీ మరణ వార్త విని చాలా బాధపడ్డానని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సోమవారం సాయంత్రం ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రణబ్‌కు బొకే అందిస్తూ స్వాగతం పలుకుతున్న ఫొటోను ఆయన సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపారు.